రాజమహేంద్రవరంకు చిరూ.. కొరటాల టీమ్

11-02-2020 Tue 13:43
  • చిరూ కథానాయకుడిగా కొరటాల మూవీ
  • పరిశీలనలో 'ఆచార్య' టైటిల్ 
  • ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచన
Acharya Movie shoot in Rajamundry

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను రాజమండ్రిలో ప్లాన్ చేశారు. చిరంజీవి .. తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రీకరించనున్నారు.

ఈ షెడ్యూల్లో త్రిష కూడా పాల్గొననున్నట్టు చెబుతున్నారు. రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ఆచార్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. వరుస విజయాల దర్శకుడైన కొరటాల నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పట్ల అందరిలోను ఆసక్తి వుంది.