Teja: తేజ తదుపరి సినిమాగా 'అలివేలు వెంకటరమణ'

Teja new movie is Alivelu Venkata Ramana
  • కొత్తదనాన్ని కోరుకునే దర్శకుడిగా తేజ 
  •  రానాతో సినిమాకి సన్నాహాలు 
  • గోపీచంద్ సినిమా కూడా పట్టాలపైకి
మొదటి నుంచి కూడా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ తేజ ముందుకు వెళుతున్నాడు. టైటిల్స్ దగ్గర నుంచి ఆయన వైవిధ్యాన్ని చూపిస్తాడు. అలా రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' చేసిన ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత రానాతోనే మరో సినిమాను చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి 'రాక్షస రాజు రావణుడు' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చేస్తూనే, మరో వైపున గోపీచంద్ హీరోగా మరో సినిమా చేయడానికి కూడా ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకి 'అలివేలు వెంకటరమణ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఈ రెండు సినిమాలను సమాంతరంగా చేయడానికి తేజ చకచకా పనులను చేయిస్తున్నాడు. ఒక్కో సినిమాను తాపీగా తెరకెక్కించే తేజ, ఇలా ఒక్కసారిగా రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తుండటం పట్ల ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
Teja
Gopi Chand
Alivelu Venkata Ramana Movie

More Telugu News