Vijay Devarakonda: అసలే ఫిబ్రవరి 14.. ఆపై విజయ్ దేవరకొండ.. 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్'కు రికార్డు స్థాయిలో బుకింగ్‌లు

vijay devarakonda new movie bookings set record
  • ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల
  • ఒక్క హైదరాబాద్‌లోనే 190 షోలు
  • ఇప్పటికే బుక్ మై షోలో 120 షోలు ఫుల్   
అసలే ఫిబ్రవరి 14.. ఆపై విజయ్ దేవర కొండ.. దానికితోడు 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' అనే ఆకర్షణీయ టైటిల్. ఇంకేముంది యువత అంతా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ అర్జున్‌ రెడ్డి సినిమాను తలపించింది. అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్  రికార్డు స్థాయిలో అవుతున్నాయి.

ఒక్క హైదరాబాద్ నగరంలోనే 190 షోలకు గానూ ఇప్పటికే బుక్ మై షోలో 120 షోలు ఫుల్ అయిపోయాయి. అంతేకాదు, సినిమా విడుదలకు తర్వాతి రోజులకు సంబంధించిన టిక్కెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతుండడం విశేషం. ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా నటిస్తున్నారు.
Vijay Devarakonda
Tollywood
Hyderabad

More Telugu News