14 ఏళ్ల అమ్మాయితో బాలుడు టిక్‌టాక్‌.. ఎందుకు చేశావంటూ నగ్నంగా ఊరేగించిన వైనం

11-02-2020 Tue 12:44
  • జైపూర్‌లో ఘటన
  • బాలుడిని కొట్టిన బాలిక తండ్రి, సోదరుడు
  • వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన
 forced to parade naked in Jaipur for TikTok video

పద్నాలుగేళ్ల ఓ అమ్మాయితో ఓ మైనర్ బాలుడు టిక్‌టాక్‌ వీడియో తీశాడు. ఆ వీడియోని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు చూశారు. అంతే, ఆ బాలుడిని పట్టుకుని కొట్టి నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఈ నెల 7న ఈ దారుణం చోటు చేసుకుంది.

తన స్నేహితురాలైన బాలికతో ఆ బాలుడు చేసిన టిక్‌టాక్‌ను బాలిక సోదరుడు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పాడు. ఇద్దరూ కలిసి బాలుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు కూడా ఆ బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.