New Delhi: ఆ రెండు అంశాలపై దృష్టి పెట్టాం.. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచాం: డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా

those two things behind aap win says manish
  • నిజమైన దేశభక్తికి మా గెలుపే నిదర్శనం
  • నేతలు ప్రజల కోసం పని చేయాలి
  • విద్యా వ్యవస్థ, ఆసుపత్రుల మీద దృష్టి పెట్టాలి
  • వీటి గురించి పనిచేశాం
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోన్న విషయంపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ఈ రోజు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... నిజమైన దేశభక్తికి తమ గెలుపే నిదర్శనమని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పని చేసేందుకు అవకాశం వస్తే, నేతలు ప్రజల కోసం పని చేయాలని, విద్యా వ్యవస్థ, ఆసుపత్రుల మీద దృష్టి పెట్టి మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆయన తెలిపారు.

ఇలా పని చేసిన పార్టీకే ఢిల్లీ ప్రజలు మద్దతు తెలిపారని మనీశ్ సిసోడియా తెలిపారు. ఎన్నికల సమయంలో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు విద్య, ఆసుపత్రుల సౌకర్యాలపై మాట్లాడారని, ఇతర పార్టీల నేతలు మాత్రం రెండు మతాల గురించి మాట్లాడారని బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కాగా, ఆప్ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యాలయాల్లో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
New Delhi
elections
AAP

More Telugu News