Varun Sandesh: నేను, వితిక అలా ప్రేమలో పడ్డాము: హీరో వరుణ్ సందేశ్

Varun tells his love story with Vithika
  • ఆ సినిమాలో కలిసి నటించాము 
  • ఒక సీన్లో ఇద్దరమూ పడిపోయాము 
  • వితిక విషయంలో కంగారు పడ్డానన్న వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్ .. వితిక షేరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లుగా వాళ్లు అన్యోన్యమైన దాంపత్యాన్ని సాగిస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైందనే విషయాన్ని గురించి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వరుణ్ సందేశ్ ప్రస్తావించాడు.

'మేము ఇద్దరం హీరో హీరోయిన్లుగా 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమా చేశాము. అప్పటికి రెండు నెలలుగా షూటింగ్ జరుగుతున్నా పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఒక సీన్లో నేను వితికాను ఎత్తుకుని పరిగెత్తాలి. ఆ సమయంలో తనని పడేసి .. నేను పడిపోయాను. ఆ అమ్మాయి నడుముకి బలమైన దెబ్బ తగిలి ఉంటుందని భావించి కంగారుపడ్డాను. ఆ రోజు నుంచి ఆమెకి కాల్ చేసి ఎలా వున్నారని కనుక్కోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది .. అది అలా పెళ్లికి దారితీసింది" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News