సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్.. భారీ స్కోరు దిశగా టీమిండియా

11-02-2020 Tue 10:59
  • 46.4 ఓవర్లో 269 పరుగులు చేసిన టీమిండియా
  • 112 పరుగులతో అదరగొట్టిన కేఎల్ రాహుల్
  • మరోసారి సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్
KL Rahul century

న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఈ టూర్ లో మంచి ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ మరోసారి సత్తా చాటి సెంచరీ సాధించాడు. 113 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 112 పరుగుల వద్ద బెన్నెట్ బౌలింగ్ లో జేమీసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

మరో ఎండ్ లో 42 పరుగులతో మనీశ్ పాండే దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 46.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు. ఇదే దూకుడు కొనసాగితే భారత్ స్కోరు 300లకు చేరే అవకాశం ఉంది. అంతకు ముందు పృథ్వి షా 40, మయాంక్ అగర్వాల్ 1, కోహ్లీ 9, శ్రేయస్ అయ్యర్ 62 పరుగులు చేశారు.