సల్మాన్ ఖాన్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

11-02-2020 Tue 10:48
  • తెలుగులో పూజా హెగ్డే జోరు
  • 'కభి ఈద్ కభి దివాళి'లో ఛాన్స్ 
  • హిందీలోను హవా సాగే అవకాశం
kabhi eid kabhi diwali Movie
పూజా హెగ్డేకి ఒక బాలీవుడ్ హీరోయిన్ కి కావలసిన లక్షణాలు పుష్కలంగా వున్నాయి. అందువల్లనే బాలీవుడ్లో చాలా త్వరగానే ఆమె ఛాన్స్ కొట్టేసింది. హృతిక్ రోషన్ సరసన భారీ చారిత్రక చిత్రమైన 'మొహెంజొదారో'లో నటించింది. దురదృష్టవశాత్తు ఆ సినిమా పరాజయంపాలు కావడం వలన, అక్కడ మరో విజయాన్ని అందుకోవడానికి ఆమెకి చాలానే సమయం పట్టింది.

ఈ నేపథ్యంలోనే తెలుగులో ఆమె స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో .. విజయాలతో దుమ్మురేపేయడం మొదలుపెట్టింది. ఈ సక్సెస్ లు ఆమెకి బాలీవుడ్ లో సల్మాన్ సరసన చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. 'కభి ఈద్ కభి దివాళి' చిత్రంలో ఆమెకి అవకాశం దక్కింది. సాజిద్ నడయాడ్ వాలా నిర్మాణంలో, ఫర్హాదా సంజీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్లోను పూజా జోరు కొనసాగే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.