కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న విజయరథం... కాసేపట్లో సవారీ!

11-02-2020 Tue 09:51
  • ఖాయమైన ఆప్ విజయం 
  • విజయరథాన్ని అందంగా అలంకరించిన కార్యకర్తలు
  • పలు ప్రాంతాలను చుట్టిరానున్న కేజ్రీ
Kejriwal Ready for Rally

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం ఖరారు కావడంతో, మరికాసేపట్లో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రత్యేక ర్యాలీని నిర్వహించనున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ ఇంటికి విజయరథం చేరుకుంది. అందంగా అలంకరించిన ఓపెన్ టాప్ జీపుపై ప్రజలకు అభివాదం చేస్తూ, కేజ్రీవాల్ నగరంలోని పలు ప్రాంతాలను చుట్టి రానున్నారు.

కాగా, ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖులుగా పేరొందిన పలువురు ఈ ఎన్నికల్లో వెనుకంజలో ఉండటం గమనార్హం. మోడల్ టౌన్ నుంచి కపిల్ మిశ్రా, న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్థి సునీల్ యాదవ్, శీలంపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మతీన్ అహ్మద్ లు తమ సమీప ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారని తెలుస్తోంది.