David Warner: డేవిడ్ వార్నర్‌కు ప్రతిష్ఠాత్మక అలెన్ బోర్డర్ మెడల్!

  • బాల్ ట్యాంపరింగ్‌లో ఏడాదిపాటు నిషేధం
  • ఒక్క ఓటు తేడాతో స్మిత్‌ను ఓడించిన వార్నర్
  • ఈ సీజన్ తనకు సంతోషాలు తెచ్చిపెట్టిందన్న ఓపెనర్
Warner beats Smith by one vote to Australian cricketer of the year award

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు క్రికెట్ నుంచి నిషేధానికి గురైన ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రతిష్ఠాత్మక అలెన్ బోర్డర్ మెడల్‌ను అందుకున్నాడు. అతడితోపాటు నిషేధం ఎదుర్కొన్న ఆసీస్ రన్ మెషీన్ స్టీవ్ స్మిత్ ఈ రేసులో నిలిచినా చివరికి వార్నర్‌కే ఈ పతకం లభించింది. 2016, 2017లో వరుసగా రెండేళ్లు ఈ పతకాన్ని అందుకున్న వార్నర్.. తాజాగా ఒక్క ఓటు తేడాతో మరోమారు దీనిని సాధించాడు.

నిషేధం తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోతున్న వార్నర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ పతకాన్ని అందజేసింది. మెడల్ అందుకున్న అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. చేసిన తప్పుకు గతంలో అందరి ముందు తల వంచుకున్నానని, ఈ సీజన్ తనలో మళ్లీ సంతోషాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నాడు.

More Telugu News