Annapurna Canteen: కేసీఆర్ కొత్త ఆలోచన... రూ. 5కే హాయిగా కూర్చుని తినేలా అన్నపూర్ణ క్యాంటీన్లు!

  • ప్రస్తుతం రోడ్డుపై నిలబడి తింటున్న పేదలు
  • 35 మంది కూర్చుని తినేందుకు ఏర్పాట్లు
  • క్యాంటీన్లను ఆధునికీకరిస్తున్న అధికారులు
Annapurna Canteens Moderanized

తెలంగాణలో పేదలకు రూ. 5కే భోజనాన్ని అందిస్తున్న క్యాంటీన్లు, ప్రస్తుతం ఓ డబ్బా మాదిరిగా వుండడంతో అక్కడే జనం నిలబడి భోజనం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అన్నపూర్ణ క్యాంటీన్ల రూపురేఖలను మార్చాలని, పేదలు కూర్చుని కడుపునిండా తినే పరిస్థితి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్నపూర్ణ క్యాంటీన్ల విస్తీర్ణాన్ని పెంచుతూ, డైనింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు, ఎల్బీ నగర్ చౌరస్తాలోని అన్నపూర్ణ క్యాంటీన్ ను మార్చారు. మరో 20 రోజుల్లో ఈ సెంటర్ లో 35 మంది కూర్చుని తినేలా సదుపాయాలను సమకూర్చుతున్నారు.

మొత్తం రూ. 8.70 లక్షల వ్యయంతో 40 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఈ సెంటర్ ను మార్చుతున్నారు. ఇక్కడ అధునాతన హంగులు ఉంటాయని, చేతులు కడుక్కునేందుకు వాష్ బేసిన్లను ఏర్పాటు చేస్తున్నామని, ఫ్యాన్ల కింద కూర్చుని, స్టీల్ ప్లేట్ లో భోజనం చేయవచ్చని అధికారులు అంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన అన్ని క్యాంటీన్లను ఆధునికీకరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

More Telugu News