Allu Arjun: 'బుట్టబొమ్మ' వీడియోల్లో నా హృదయాన్ని తాకిన వీడియో ఇదే!: అల్లు అర్జున్

Allu Arjun feels happy after seeing Buttabomma Tiktok video of Physically challenged
  • అల... వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటకు విశేష ప్రజాదరణ
  • టిక్ టాక్ వీడియో చేసిన ఇద్దరు దివ్యాంగులు
  • ఆ వీడియో ఎంతో స్ఫూర్తి కలిగిస్తోందన్న బన్నీ
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల... వైకుంఠపురములో చిత్రంలో బుట్టబొమ్మ సాంగ్ ఎంతో ప్రజాదరణ పొందింది. తమన్ అందించిన క్యాచీ ట్యూన్లతో సాగే ఆ గీతం యువతను విశేషంగా అలరిస్తోంది. ఇప్పుడీ పాటను టిక్ టాక్ చేస్తూ ఎన్నో వీడియోలు వచ్చాయి.

అయితే, ఇద్దరు దివ్యాంగులు చేసిన టిక్ టాక్ వీడియోను హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. బుట్టబొమ్మ సాంగ్ పై వచ్చిన అన్ని వీడియోల్లో తన హృదయాన్ని తాకిన వీడియో ఇదేనని పేర్కొన్నారు. ఎల్లలను చెరిపివేస్తూ ఆ పాట ప్రజల్లోకి వెళ్లిన వైనం తనను ఎంతో సంతోషానికి గురిచేస్తోందని బన్నీ తెలిపారు. ఆ వీడియోలో బుట్టబొమ్మ పాటకు దివ్యాంగులు డ్యాన్స్ చేస్తున్న తీరు స్ఫూర్తిదాయకం అని అభివర్ణించారు.
Allu Arjun
Ala Vaikunthapuramulo
Butta Bomma
TikTok
Video

More Telugu News