Jackie Chan: కరోనా వైరస్ కు మందు కనిపెడితే కోటి రూపాయలు ఇస్తానన్న జాకీచాన్

 Jockie Chan offers one crore for invention of drug to Corona virus
  • ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్
  • వైరస్ ను ఎదుర్కొనే ఔషధం కోసం తీవ్ర పరిశోధనలు
  • శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చిన జాకీచాన్
కరోనా వైరస్ ఇప్పటికే సుమారు వెయ్యిమంది ప్రాణాలను హరించివేసింది. వేలమంది బాధితులు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో, కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు తీవ్రస్థాయిలో పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పరిశోధనల కోసం పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.

తాజాగా, ప్రముఖ నటుడు జాకీచాన్ కూడా ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వుహాన్ నగరంలో కరోనా నిరోధక మాస్కులు, ఇతర సామగ్రి అందజేస్తున్నారు. అంతేకాదు, కరోనా వైరస్ కు మందు కనిపెడితే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. తన నగదు బహుమతి శాస్త్రవేత్తలను మరింత ప్రోత్సహిస్తుందని భావిస్తున్నట్టు జాకీచాన్ అభిప్రాయపడ్డారు.
Jackie Chan
Corona Virus
Cash Prize
Wuhan

More Telugu News