Minister Talasani Srinivas Yadav: చిరంజీవి, నాగార్జునలతో తెలంగాణ మంత్రి తలసాని భేటీ

  • సినీపరిశ్రమ అభివృద్ధిపై చర్చ
  • మరోసారి సమావేశమవుతామన్న మంత్రి
  • ఆ తర్వాతే ప్రెస్ మీట్లో వివరాలు తెలుపుతాం
టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలు, పరిష్కారాలు, అభివృద్ధి తీరుపై ఈ రోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో చర్చించారు. వీరి సమావేశం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. ఈ విషయాన్ని సౌత్ ఇండియన్ మూవీస్ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే సమావేశం వివరాలను మంత్రి వెల్లడించలేదని, మరోసారి భేటీ అయిన తర్వాత అన్ని వివరాలను ప్రెస్ మీట్లో తెలియజేస్తామని మంత్రి చెప్పారని ఆయన తెలిపారు.  
Minister Talasani Srinivas Yadav
Meet
Chiranjeevi
Nagarjuna
Annapurna Studios

More Telugu News