Herbal Ayurveda: 'హెర్బల్ ఆయుర్వేదం' పేరుతో ఆన్ లైన్ లో కుచ్చుటోపీ... మోసగాడి అరెస్ట్

  • డిస్ట్రిబ్యూటర్ల నియామకం పేరుతో డబ్బులు వసూలు
  • బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు
  • పోలీసుల అదుపులో కర్నూలు వాసి అబ్దుల్ ముఫీజ్

ఆన్ లైన్ లో 'హెర్బల్ ఆయుర్వేదం' అంటూ ఓ వ్యక్తి పలువురికి టోకరా వేశాడు. డిస్ట్రిబ్యూటర్ల నియామకం పేరుతో ఆశ చూపి రూ.11.5 లక్షలు వసూలు చేశాడు. అతడి మోసం తెలిసి బాధితులు లబోదిబోమన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అబ్దుల్ ముఫీజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కర్నూలు వాసిగా గుర్తించారు. అతడి నుంచి 3 మొబైల్ ఫోన్లు, 4 ఏటీఎం కార్డులు, రూ.34 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముఫీజ్ బాధితుల్లో అత్యధికులు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా వాసులు ఉన్నట్టు గుర్తించారు.

More Telugu News