Central Funds: గత ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించిన కేంద్రం

  • 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూతో ఉంది
  • అనంతరం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది
  • ఆరేళ్లలో పన్నుల వాటా కింద రూ.85,013కోట్లు విడుదల
Minister Nirmala Sitaraman gives details of central funds given to Telengana

గత ఆరేళ్లలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలు తెలపాలంటూ.. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ సమయం(2014-15) లో తెలంగాణ మిగులు రెవెన్యూతో ఉన్న రాష్ట్రమన్నారు. అనంతరం తెలంగాణకు అప్పులు పెరిగాయన్నారు.

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల్లో భాగంగా పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు, రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ.1289.04 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద రూ.6,511 కోట్లు, వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేక సహాయం కింద రూ.1,916 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కాగా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.51,298.84 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు తెలంగాణకు విడుదల చేసినట్లు నిర్మల తన సమాధానంలో పేర్కొన్నారు.

More Telugu News