V: ఈ నెల 17న 'వి' మూవీ టీజర్

  • నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో 'వి'
  • ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం
  • మార్చి 25న రిలీజ్

నాని, సుధీర్ బాబు ప్రధానపాత్రల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'వి'. ఇందులో నాని ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తుండడం విశేషం. నానికి దీటుగా ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నాడు. 'వి' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

కాగా, ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు. 'నాణేనికి రెండు వైపులు... బొమ్మ, బొరుసు... నేరం, న్యాయం' అంటూ సినిమా థీమ్ ను వెల్లడించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో అదితీరావు హైదరీ, నివేదా థామస్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 'వి' చిత్రం మార్చి 25న రిలీజ్ కానుంది.

More Telugu News