Harbhajan Singh: తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్న క్రికెటర్ హర్భజన్ సింగ్

  • భజ్జీ కథానాయకుడిగా ఫ్రెండ్షిప్
  • భజ్జీకి జోడీగా శ్రీలంక బ్యూటీ
  • తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానున్న చిత్రం

టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సరికొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఆఫ్ స్పిన్నర్ గా బంతిని సుడులు తిప్పుతూ ప్రత్యర్థులను హడలెత్తించిన ఈ పంజాబ్ యోధుడు ఇప్పుడు సినీ హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. భజ్జీ కథానాయకుడిగా తమిళంలో ఫ్రెండ్షిప్ అనే చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలంకకు చెందిన లోస్లియా మరియనేసన్ ఈ చిత్రంలో హీరోయిన్. జేపీఆర్, స్టాలిన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య ద్వయం దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

More Telugu News