Chevireddy Bhaskar Reddy: ఏబీ వెంకటేశ్వరరావుపై ఐటీ, ఈడీ దాడులు జరిగితే ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటకొచ్చేవి: చెవిరెడ్డి భాస్కరరెడ్డి

  • అవినీతికి పాల్పడ్డ అరాచకవాది ఏబీ  
  • ఆయనపై కేంద్రం చర్యలు తీసుకోవాలి
  • తెలంగాణలో ఏబీకి ఆస్తులు ఉన్నాయి
ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతికి పాల్పడ్డ అరాచకవాది ఏబీ వెంకటేశ్వరరావు విషయమై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో దేశానికే ప్రమాదకరమైన వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తి వెంకటేశ్వరరావు అని, ఆయనపై కేంద్రం సీరియస్ గా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబునాయుడు పీఏలపై కన్నా ముందు ఏబీ వెంకటేశ్వరరావుపై ఐటీ, ఈడీ దాడులు జరిగి ఉన్నట్టయితే ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటకొచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి తమ దృష్టికి వచ్చిన వాస్తవాల్లో ‘మచ్చుకు కొన్ని’ అంటూ.. తెలంగాణలోని జడ్చర్లలో ఏబీ వెంకటేశ్వరరావుకు 53.07 ఎకరాలు, పశుల గ్రామంలో 57.59 ఎకరాలు.. ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పథకం ద్వారా కూడా ఆయన లబ్ధి పొందారని అన్నారు.
Chevireddy Bhaskar Reddy
YSRCP
AB Venkateswara Rao
IPS
Andhra Pradesh

More Telugu News