K.S. Ravi Kumar: 'రూలర్' దర్శకుడికి అవకాశం ఇచ్చిన అజిత్

  • వరుసగా వెంటాడుతున్న పరాజయాలు
  • తెలుగులోను అదే పరిస్థితి 
  • గతంలో అజిత్ కి హిట్ ఇచ్చిన 'విలన్'  
ఒకప్పుడు తమిళంలో వరుస విజయాలను సొంతం చేసుకున్న కేఎస్ రవికుమార్, ఆ తరువాత పరాజయాలతో వెనకబడుతూ వచ్చారు. తమిళంలో స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆలోచనలో పడుతున్న పరిస్థితుల్లోనే ఆయన తెలుగుపై దృష్టి పెట్టి, బాలకృష్ణతో 'జై సింహా' .. 'రూలర్' సినిమాలను తెరకెక్కించాడు.'జై సింహా' ఓ మాదిరిగా ఆడగా, 'రూలర్' భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే కేఎస్ రవికుమార్ కి అజిత్ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఈ విషయాన్ని కేఎస్ రవికుమార్ స్వయంగా తెలియజేశాడు. చాలాకాలం క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్లో 'విలన్' సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్ అయింది .. అజిత్ స్థాయిని పెంచింది. అలా తనకి లైఫ్ ఇచ్చిన దర్శకుల కెరియర్ ఇబ్బందుల్లో పడినప్పుడు అజిత్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్న సందర్భాలు చాలానే వున్నాయి. అలా అజిత్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని రవికుమార్ మళ్లీ తన సత్తా చాటుకుంటాడేమో చూడాలి.
K.S. Ravi Kumar
Ajith
kollywood

More Telugu News