Diabetes: మధుమేహులకు వినూత్న పట్టీ.. పరిశోధకుల ఆవిష్కరణ!

  • ఓ వినూత్న పట్టీ (ప్యాచ్‌)ని రూపొందించిన అమెరికా పరిశోధకులు
  • పట్టీలో కృత్రిమ ఇన్సులిన్‌ 
  • శరీరంలో గ్లూకోజ్‌ హెచ్చుతగ్గులు రాకుండా చేయగలిగే ప్యాచ్

డ‌యాబెటిక్ (మధుమేహం) ప్ర‌తి ఒక్క‌రినీ భయపెడుతున్న సమస్య. మారుతోన్న ఆహార అలవాట్లు, గతితప్పిన జీవన విధానం కారణంగా మూడు పదుల వయసు దాటకుండానే మధుమేహం బారిన పడుతోన్న వారు పెరిగిపోతున్నారు.
                          
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా అమెరికా పరిశోధకులు ఓ వినూత్న పట్టీ (ప్యాచ్‌)ని రూపొందించారు. ఇది మధుమేహం ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని నార్త్‌ కరోలినా వర్సిటీ పరిశోధకులు చెప్పారు. రూపాయి నాణెం సైజులో ఉండే ఈ స్మార్ట్‌ ఇన్సులిన్‌ డెలివరీ ప్యాచ్‌ను మధుమేహులు శరీరానికి అతికించుకోగానే తన పనిని మొదలుపెడుతుంది.

ఈ పట్టీ కింది భాగంలో 1 మిల్లీమీటరు కంటే తక్కువ పొడవుతో సూక్ష్మమైన సూదులు ఉంటాయి. వీటిలో ముందుగానే కృత్రిమ ఇన్సులిన్‌ నింపుతారు. మధుమేహుల శరీరంలో బ్లడ్‌ షుగర్‌ మోతాదులు బాగా తగ్గినట్టు ఈ ప్యాచ్‌ గుర్తించగానే, దానికి ఉన్న సూదుల నుంచి ఇన్సులిన్‌ రోగి శరీరంలోకి విడుదలవుతుంది. తద్వారా మధుమేహం ఉన్న వారి శరీరంలో గ్లూకోజ్‌ హెచ్చుతగ్గులు రాకుండా చేస్తుంది.

More Telugu News