Allu Arjun: బన్నీని ఒప్పించే ప్రయత్నంలో సుకుమార్

  • తమన్ ను తీసుకుందామన్న బన్నీ 
  • దేవిశ్రీ వైపు మొగ్గు చూపుతున్న సుకుమార్ 
  • ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా  
సుకుమార్ .. బన్నీ కాంబినేషన్లో మూడో సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని బన్నీ వ్యక్తం చేశాడట.

'అల వైకుంఠపురములో' సినిమా భారీ విజయాన్ని సాధించడంలో తమన్ సంగీతం ప్రధాన పాత్రను పోషించింది. అందువలన ఈ సినిమాకి కూడా తమన్ అయితే బాగుంటుందని బన్నీ అన్నాడట. అయితే దేవిశ్రీ ప్రసాద్ తో తనకి మంచి బాండింగ్ ఉందనీ, తన సినిమాలకి ఆయన ఇచ్చిన సంగీతం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వచ్చిందని సుకుమార్ అన్నాడట. అందువలన దేవిశ్రీనే తీసుకుందామని సుకుమార్ చెప్పాడట. చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారనేది చూడాలి. బన్నీకి ఇది 20వ చిత్రం కాగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
Allu Arjun
Sukumar
Thaman
Devisri Prasad

More Telugu News