Shahrukh Khan: హీరో షారుక్ ఖాన్‌ గర్వపడే పని చేసిన కుమారుడు

  • తైక్వాండోలో గోల్డ్ మెడల్ సాధించిన కుమారుడు అబ్రామ్
  • గర్వంగా ఉందన్న షారుక్
  • స్ఫూర్తిని పొందుతున్నానంటూ ట్వీట్
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్రామ్ తన తండ్రి గర్వపడేలా గోల్డ్ మెడల్ సాధించాడు. ఆరేళ్ల వయసులోనే తైక్వాండోలో బంగారు ప‌త‌కం సాధించిన తన కుమారుడి ఫొటోలను పోస్ట్ చేస్తూ షారుక్ హర్షం వ్యక్తం చేశాడు.

'శిక్షణ తీసుకున్నావు.. ఫైట్ చేశావు.. విజయం సాధించావు. మళ్లీ ఇదే విధంగా కష్టపడి పనిచేయి. ఈ పతకంతో.. నా పిల్లలకు నాకన్నా ఎక్కువ అవార్డులు ఉన్నాయని భావిస్తున్నాను. ఇది మంచి విషయం. ఇప్పుడు నేను మరింత శిక్షణ పొందాల్సి ఉంది. నా పిల్లలను చూసి గర్విస్తున్నాను, స్ఫూర్తిని పొందుతున్నాను' అని పేర్కొన్నాడు. కాగా, కిర‌ణ్ అనే వ్య‌క్తి వద్ద అబ్రామ్‌తో పాటు ఆర్య‌న్‌, సుహానాలు తైక్వాండోలో శిక్ష‌ణ పొందుతున్నారు. గతంలోనూ వారు పలు పతకాలు సాధించారు.
Shahrukh Khan
Bollywood

More Telugu News