Crime News: చిన్న విషయానికే తీవ్ర నిర్ణయం...అత్తపై హత్యా యత్నం!
- భార్య తల్లిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన ఘనుడు
- తీవ్రంగా గాయపడిన బాధితురాలు
- భార్యతో తగాదా సందర్భంగా జోక్యం చేసుకుందన్న అక్కసు
దంపతుల మధ్య మనస్పర్థలు, గొడవలు సహజం. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం అంతకంటే సహజం. ఆ మాత్రం దానికే ఆవేశపడిపోయిన ఓ అల్లుడు అత్తపై హత్యా యత్నం చేశాడు. బాధితురాలి కుమార్తె అందించిన వివరాల్లోకి వెళితే...మహబూబ్‌నగర్ జిల్లా అనంతసాగరం మండలం వెరుబొట్లపల్లికి చెందిన వెంకటరమణ, జయమ్మ దంపతులు. జయమ్మ తల్లి లక్ష్మమ్మ గౌరవరంలో ఉంటోంది. ఆమెకు అనారోగ్యంగా ఉందని తెలిసి జయమ్మ తల్లిని చూడడానికి కొన్నాళ్ల క్రితం వెళ్లింది. భార్య కోసం వెంకటరమణ నిన్న గౌరవరం వచ్చాడు.
రాత్రి పడుకునే ముందు మంచం విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటల యుద్ధం తీవ్రం కావడంతో లక్ష్మమ్మ తగువులో జోక్యం చేసుకుని సర్దిచెప్పాలని ప్రయత్నించింది. భార్యతో తగువుపడుతుంటే అత్త జోక్యం చేసుకుంటోందన్న ఆవేశంలో వెంకటరమణ తన బండి నుంచి పెట్రోల్ తీసి అత్తపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన లక్ష్మమ్మను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.