Madhavilatha: కేసీఆర్, అక్బరుద్దీన్ భేటీపై సినీ నటి మాధవీలత వ్యాఖ్యలు!

  • నిన్న కేసీఆర్, అక్బరుద్దీన్ భేటీ
  • లాల్ దర్వాజా దేవాలయ అభివృద్ధికి నిధులు
  • మార్పు మొదలైంది... అంటూ మాధవీలత పోస్ట్
హైదరాబాద్, పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులను కోరుతూ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడం, ఆ వెంటనే నిధులను మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ వ్యాఖ్యానించడంపై సినీ నటి మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది.

ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ, "మార్పు మొదలైంది. మోడీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితమయింది.. అయ్యబాబోయి, మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు, నిన్న జనగణమన పాడేరు. నేడు గుడులు బాగుచేయాలంటున్నారు. మోడీ, నువ్వు సామాన్యుడివి కాదయ్యా...
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కోరారు" అని అన్నారు.

Madhavilatha
Narendra Modi
KCR
Akbaruddin Owaisi

More Telugu News