Ramgopal Varma: రామ్ గోపాల్ వర్మ తాతయ్యా.... కంగ్రాచ్యులేషన్స్: రాజమౌళి ట్వీట్

  • వర్మ కుమార్తెకు ఆడపిల్ల
  • కళ్లెం వేసే మనవరాలు వచ్చేసింది
  • ఏమనాలో మీరే చెప్పాలన్న రాజమౌళి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుమార్తె, పండంటి బిడ్డను ప్రసవించడంతో, ఆయనకు తాతయ్య హోదా వచ్చేసింది. ఇక ఇదే విషయాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి, తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావిస్తూ, పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. "కంగ్రాచ్యులేషన్స్ రామూ తాతయ్య గారూ. చిట్టచివరకు మీకు కళ్లెం వేసేందుకు మీ మనవరాలు వచ్చేసింది. ఇక మిమ్మల్ని ఏమని పిలవాలి? రామూ తాతా, రామూ నాన్నా లేదా గ్రాండ్ పా రామూ?" అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Ramgopal Varma
Rajamouli
Grandfather
Twitter

More Telugu News