గోరంట్ల మాధవ్ కియా ప్రతినిధుల కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగాలి: మంతెన సత్యనారాయణరాజు

09-02-2020 Sun 20:44
  • గోరంట్ల మాధవ్ పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు
  • మాధవ్ రాజకీయాల్లోకి రావడం దౌర్భాగ్యమన్న సత్యనారాయణరాజు
  • మాధవ్ నీతులు మాట్లాడడం మరీ దారుణమని వెల్లడి
ఎన్నో ఆరోపణలు ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రావడం దౌర్భాగ్యమని టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గోరంట్ల మాధవ్ నీతులు మాట్లాడుతుండడం మరీ దారుణమని వ్యాఖ్యానించారు. మాధవ్ లాంటి వాళ్ల చర్యలకు భయపడే కంపెనీలు పారిపోతున్నాయని తెలిపారు. మాధవ్ కియా ప్రతినిధుల కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. వైసీపీ అడ్డుపడకుండా ఉంటే చంద్రబాబు మొదలుపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ నిర్విరామంగా సాగేదని పేర్కొన్నారు.