Nimmakayala Chinarajappa: వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది: మాజీ మంత్రి చినరాజప్ప

  • ప్రభుత్వం నిరంకుశ వైఖరితో పాలన సాగిస్తోంది
  • పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగి సస్పెన్షన్ దారుణం
  • 170 మంది పోలీస్ అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వలేదు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి చినరాజప్ప ఖండించారు. వైసీపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో పాలన సాగిస్తోందని, పోలీస్ శాఖ లో ఉన్నత ఉద్యోగిని సస్సెండ్ చేయడం దారుణమని అన్నారు. తమ హయాంలో చంద్రబాబు నీతివంతమైన పాలన అందించారని, ముఖ్యమైన సమాచారం అందించడంలో ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంతో సన్నిహితంగా ఉన్నారు. 170 మంది పోలీస్ అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, దీనిపై పోలీస్ అధికారుల సంఘం స్పందించాలని పిలుపు నిచ్చారు.

  • Loading...

More Telugu News