Kala venkatrao: వైసీపీ ప్రభుత్వం పనికట్టుకుని కొందరు అధికారులపై కక్ష సాధిస్తోంది: కళా వెంకట్రావు

  • ఉద్యోగుల పొట్ట కొట్టేవిధంగా ప్రభుత్వం ప్రవర్తించడం దారుణం
  • అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలి
  • లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు. ప్రభుత్వం పనికట్టుకుని కొందరు అధికారులపై కక్షసాధిస్తోందని ఆరోపించారు. అధికారులపై కోపం ఉంటే ప్రాధాన్యత లేని పోస్ట్ కు బదలాయిస్తారే తప్ప ఈవిధంగా చేయడం కరెక్టు కాదని అన్నారు. ఉద్యోగుల పొట్ట కొట్టేవిధంగా ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ ప్రవర్తించలేదంటూ వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు కనుక ఆపకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Kala venkatrao
Telugudesam
AB Venkateswara Rao
YSRCP
Government
Andhra Pradesh

More Telugu News