పోలవరంతో మాకు తీవ్ర నష్టం... ఆపేయాల్సిందే: సుప్రీంను ఆశ్రయించిన ఒడిశా ప్రభుత్వం
- ఏపీలో భారీ ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరం
- పోలవరం నిలిపివేయాలంటూ సుప్రీంలో ఒడిశా ప్రభుత్వం అఫిడవిట్
- ముంపు విషయంలో స్పష్టత లేదని ఆందోళన
- 200 అడుగులకు పైగా ముంపు రావొచ్చని సందేహం
పోలవరం వద్ద గోదావరి వరద నీటి పరిమాణం 36 లక్షల క్యూసెక్కులు అని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కు వెల్లడించిందని, వాస్తవానికి ఆ వరద నీటి ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులు ఉంటుందని ఒడిశా సర్కారు వివరించింది. గోదావరిలో 58 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చే అవకాశం ఉందని రూర్కీ ఐఐటీ కూడా చెప్పిందని పేర్కొంది. తద్వారా ఒడిశా పరిధిలోని ప్రాంతాల్లో 200 అడుగులకు పైగా ముంపు వచ్చే ప్రమాదం ఉందని ఒడిశా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతటి తీవ్ర వరదను పోలవరం డ్యామ్ ఎలా తట్టుకుంటుందన్నది సందేహాస్పదమేనని తెలిపింది.