Swapna: ఎస్సార్ నగర్ స్వప్న హత్య కేసులో నయా ట్విస్ట్!

  • అల్లుడు తప్పుడు ఫిర్యాదు ఇప్పించాడు
  • హత్య వెనుక అతని ప్రమేయం ఉంది
  • పోలీసులకు తాజాగా స్వప్న తల్లిదండ్రుల ఫిర్యాదు
ఎస్‌ఆర్‌నగర్‌లో స్వప్న అనే యువతి అనుమానాస్పద కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. స్వప్న భర్త అరుణ్‌ తమతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించాడని ఆమె తల్లిదండ్రులు కొత్త కేసు పెట్టారు. కాగా, స్వప్న స్నానం చేస్తున్న సమయంలో ప్రశాంత్ అనే యువకుడు వీడియో చిత్రీకరించి, బ్లాక్ మెయిల్ చేశాడని, ఆమనస్తాపంతో తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని తొలుత ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, ఇప్పుడు అరుణ్ తమ బిడ్డను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో అరుణ్ ఇచ్చిన ఫోన్ నంబర్లు తప్పుడువని విచారణలో వెల్లడైంది. దీంతో స్వప్న మరణం వెనుక అరుణ్ ప్రమేయం ఉండవచ్చన్న అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నారు.
Swapna
Sucide
Murder
Arun
Police

More Telugu News