Train Accident: రైల్వే పట్టాలపై ట్రక్కును ఢీ కొన్న రైలు.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

  • టర్కీలోని అఫియాన్‌లో ఘటన
  • తప్పిన ప్రాణాపాయం
  • నిబంధనలు పట్టించుకోకుండా ట్రక్కు నడిపిన డ్రైవర్

రైల్వే పట్టాలపై ఓ ట్రక్కును రైలు ఢీ కొట్టిన ఘటన టర్కీలోని అఫియాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రైల్వే పట్టాలను దాటాల్సి ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించి ట్రక్కు డ్రైవర్ దుస్సాహసానికి ప్రయత్నించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
                              
 రైల్వే ట్రాకును దాటకూడదని, రైలు వస్తోందని సూచిస్తూ అక్కడ సిగ్నల్స్ పడ్డప్పటికీ, బారియర్లు మూసేసి ఉన్నప్పటికీ ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అదే సమయంలో రైలు వచ్చి ట్రక్కును ఢీ కొంది. ఆ ట్రక్కులోని బ్రెడ్ ప్యాకెట్లు అన్నీ నాశనమయ్యాయి. కొన్ని మీటర్ల వరకు ఎగిరిపడడంతో ట్రక్కు పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.    

  • Loading...

More Telugu News