Sri chaitanya school: శ్రీ చైతన్య పాఠశాల ఉపాధ్యాయుల విహారయాత్ర బస్సు బోల్తా!

  • ప్రకాశం జిల్లాలోని పొట్లపాడు వద్ద ఘటన
  • ఆటోను తప్పించబోయి బోల్తా కొట్టిన బస్సు
  • పది మందికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లాలో శ్రీ చైతన్య పాఠశాల బస్సు బోల్తా కొట్టింది. నరసరావుపేట శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు భైరవ కోన విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. కురిచేడు మండలం పొట్లపాడు వద్ద ఆటోను తప్పించబోయిన బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమీప ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నట్టు స్థానికుల సమాచారం.
Sri chaitanya school
Excursion
Bus
Road Accident

More Telugu News