renult twizy: భలే భలే బుల్లి కారు...యూపీ ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణ!

  • ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ప్రదర్శన
  • ఆకట్టుకుంటున్న ఫ్రెంచ్‌ కార్ల కంపెనీ రెనాల్టో ‘ట్విజీ’మోడల్‌
  • విద్యుత్‌తో నడిచే రెండు సీట్ల కారు

చిన్నకార్ల తయారీలో పేరొందిన జపాన్‌ సుజుకీ కంపెనీని తలదన్నేలాంటి బుల్లి కారును డిజైన్‌ చేసింది ఫ్రెంచ్‌ కార్ల కంపెనీ రెనాల్టో. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రేటర్‌ నోయిడాలో ప్రస్తుతం జరుగుతున్న ‘ఆటో ఎక్స్‌పో 2020’లో ఈ కంపెనీ ప్రదర్శిస్తున్న  ‘ట్విజీ’ మోడల్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది టాటా నానో కారు కంటే చిన్నది. ప్రేమికులను ఆకట్టుకునేందుకా అన్నట్లు వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఈ రెండు సీట్ల కారును కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. యూరోపియన్‌ యూనియన్‌ మార్కెట్లో ప్రస్తుతం ఈ కారుకు మంచి ఆదరణ ఉందని చెబుతున్న కంపెనీ ప్రతినిధులు భారతీయ మార్కెట్లో కారును విడుదల చేసే ప్రణాళికలు ఉన్నట్లు మాత్రం వెల్లడించలేదు.

6.1 కిలోవాట్‌ బ్యాటరీతో నడిచే ఈ కారును ఒకసారి చార్జిచేస్తే వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బ్యాటరీ చార్జింగ్‌కు నాలుగు గంటల సమయం పడుతుంది. విండ్‌స్క్రీన్‌, డోర్స్‌, పనోరమిక్‌ సన్‌ రూఫ్‌తో క్రేజీ లుక్‌తో కనిపిస్తోంది. అయితే ఈ రెండు సీట్ల కారు చాలా ఇరుకుగా ఉండడంతో ఒడ్డూ, పొడుగూ కాస్త ఎక్కువ ఉన్న వారికి అంత అనుకూలం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

More Telugu News