Delhi Elections: ఢిల్లీ అల్లర్లకు కేంద్ర బిందువైన షహీన్ బాగ్ ప్రాంతంలో.. పోలింగ్ బూత్ లకు పోటెత్తుతున్న ఓటర్లు

  • గత రెండు నెలలుగా అట్టుడుకుతున్న షహీన్ బాగ్
  • ఐదు పోలింగ్ స్టేషన్లను అత్యంత సున్నితమైనవిగా ప్రకటించిన ఈసీ
  • ఓటర్లలో వెల్లివిరుస్తున్న చైతన్యం

సీఏఏ వ్యతిరేక అల్లర్లు, ఆందోళనలకు కేంద్ర బిందువైన ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో భారీ ఎత్తున పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ బూత్ లకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఓటర్లలో చైతన్యం వెల్లివిరుస్తోంది. భారీ సంఖ్యలో ఓటర్లు వస్తుండటంతో... క్యూలైన్లు అమాంతం పెరిగిపోయాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వీధుల్లోకి క్యూలైన్లు పెరిగిపోయాయి. ఓఖ్లా నియోజవర్గంలో షహీర్ బాగ్ ఉంది. గత రెండు నెలలుగా ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది.

మరోవైపు, షహీన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఐదు పోలింగ్ స్టేషన్లను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, కాంగ్రెస్ తరపున పర్వేజ్ హష్మి, బీజేపీ తరపున బ్రహ్మ్ సింగ్ బిధూరి బరిలోకి దిగారు. సీఏఏ ఆందోళనల నేపథ్యంలో, ఈ నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి తీర్పును వెలువరిస్తారో అని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

More Telugu News