Telangana: తెలంగాణ ఎన్జీవోల క్రీడల్లో విషాదం... సురేశ్ అనే ఉద్యోగి మృతి

  • పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేశ్
  • కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన సురేశ్
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం
  • చికిత్స పొందుతూ మృతి
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ మైదానంలో తెలంగాణ ఎన్జీవోల క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ క్రీడల్లో విషాదం చోటుచేసుకుంది. డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేశ్ మరణించారు. ఈ క్రీడల్లో సురేశ్ కూడా పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇతర ఉద్యోగులు అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స అందిస్తుండగానే కన్నుమూశాడు. దాంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది.
Telangana
NGO
Sports And Games
Suresh
Dichpalli

More Telugu News