germany: అధికంగా వ్యాయామం చేస్తున్నారా?.. ప్రమాదమని హెచ్చరిస్తున్న పరిశోధకులు!

  • అధికంగా వ్యాయామం చేస్తే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం 
  • గుర్తించిన జర్మనీలోని కార్ల్స్‌రుహే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు 
  • అధికంగా తినే రుగ్మతతో బాధపడుతున్న వారికి మరీ ప్రమాదం

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. సర్వరోగాలకు వ్యాయామం ఓ మందులా పనిచేస్తుంది. అయితే, అతి ఏదైనా అనర్థమే అన్నట్లు వ్యాయామాన్ని కూడా అతిగా చేస్తే ప్రమాదం తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అధికంగా వ్యాయామం చేస్తే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని  జర్మనీలోని కార్ల్స్‌రుహే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు తేల్చారు.

కొందరు అధికంగా తినే రుగ్మతతో బాధపడుతుంటారు. వారికి అధిక వ్యాయామం మరింత ప్రమాదమని పరిశోధకులు చెప్పారు. అధికంగా తినే అలవాటుతో బాధపడే వారు ప్రతికూల ఆలోచనలు, మానసిక స్థితిని అదుపులో ఉంచుకోవడం కోసం అధికంగా వ్యాయామం చేసేందుకు మొగ్గుచూపుతారని, ఈ క్రమంలో అది వ్యసనంగా మారే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరించారు. 

More Telugu News