Guwahati: తమ ప్రాంతానికి మోదీ వస్తున్నారని ఆనందంతో డ్యాన్స్‌ వేసిన స్థానికులు.. వీడియో ఇదిగో

  • అసోంలో ప్రత్యేక బోడోలాండ్‌ కోసం దశాబ్దాలుగా పోరాటం
  • ప్రజలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం
  • గువాహటి విమానాశ్రయానికి చేరుకున్న మోదీ
  • కాసేపట్లో కోక్రాఝర్ లో సభ

అసోంలో ప్రత్యేక బోడోలాండ్‌ కోసం దశాబ్దాలుగా జరుగుతోన్న పోరాటం పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బోడోలాండ్‌ ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కేంద్రంతో అసోం ప్రభుత్వం, బోడో పోరాట సంస్థలకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అనంతరం తమ ప్రాంతానికి తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తుండడంతో అక్కడి ప్రజలు నృత్యాలు చేశారు.
                 అసోంలోని కోక్రాఝర్ లో ఏర్పాటు చేసిన ఓ సభలో కాసేపట్లో మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటికే ఆయన గువాహటి విమానాశ్రయానికి చేరుకున్నారు. కేంద్రం చేసుకున్న కొత్త ఒప్పందంపై అసోం వాసులు హర్షం వ్యక్తం చేస్తూ జాతీయ జెండాలు పట్టుకుని సభాస్థలికి వచ్చారు. మూడు దశాబ్దాల వ్యవధిలో ప్రభుత్వం బోడోలతో కుదర్చుకున్న మూడో ఒప్పందం ఇది.

More Telugu News