SBI: ఆర్బీఐ కనికరించకున్నా... అన్ని రకాల రుణాలపై వడ్డీని తగ్గించిన ఎస్బీఐ!

  • 5 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు
  • 10వ తేదీ నుంచి అమలులోకి
  • వెల్లడించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కీలకమైన రెపో, రివర్స్ రెపో రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించకున్నా, దేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్బీఐ, తన ఖాతాదారులకు ఊరట కలిగించింది. ఎంసీఎల్ఆర్ ను 0.5 శాతం మేరకు తగ్గిస్తున్నామని, ఈ నెల 10 నుంచి ఇది అమలవుతుందని వెల్లడించింది. అన్ని రకాల రుణాలపైనా ఈ తగ్గింపు అమలవుతుందని తెలిపింది.

కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ను తగ్గించడం ఇది వరుసగా 9వ సారి కావడం గమనార్హం. ఆర్బీఐ రెపో రేటును సవరించకున్నా, రూ. లక్ష కోట్ల వరకూ దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ ను ప్రకటించిన నేపథ్యంలోనే, వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది.

కాగా, నిన్న జరిగిన పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 5.15 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.

More Telugu News