Viral Videos: పాముతో మహిళా జర్నలిస్టు రిపోర్టింగ్.. బుసలు కొట్టడంతో గజగజా వణికిపోయిన అమ్మాయి.. వీడియో వైరల్

  • ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లో ఘటన
  • అవగాహన ప్రోగ్రాంలో పామును మెడలో వేసుకున్న యువతి
  • చాలా భయపడ్డానని చెప్పిన జర్నలిస్టు

పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ ఓ మహిళా జర్నలిస్టు ఓ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇందులో భాగంగా తన మెడలో పామును వేసుకుంది. ఆ సమయంలో పాము బుసలు కొట్టడంతో ఆమె భయంతో గజ గజా వణికిపోయింది.. మూడు సార్లు ఇలా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్కై న్యూస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
              ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా జర్నలిస్టు పట్టుకున్న మైకుపై ఆ పాము కాటు వేసినంత పని చేసింది.  'మైకు దగ్గరలోనే నా చేయి ఉంది. దీంతో నేను చాలా భయపడి పోయాను' అని ఛానల్ 9 మహిళా జర్నలిస్టు తెలిపింది. ఒక వేళ ఆ పాము తన చేతిపై కాటు వేస్తే ఏం జరిగి ఉండేది? అని ఆమె ప్రశ్నించింది.

More Telugu News