Allu Arjun: శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్‌.. గడ్డంతో కొత్త లుక్‌లో స్టైలిష్ స్టార్

  • బన్నీతో భార్య, పిల్లలు
  • త్రివిక్ర‌మ్‌, నిర్మాతలు రాధాకృష్ణ‌, బ‌న్నీవాసు కూడా
  • అల.. వైకుంఠపురములో సక్సెస్‌తో శ్రీవారి దర్శనం
అల.. వైకుంఠపురములో సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర బృందం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో వారు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్‌ వేంకటేశ్వరుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు. వారితో పాటు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, నిర్మాతలు రాధాకృష్ణ‌, బ‌న్నీవాసు కూడా ఉన్నారు.
              
రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి అశీర్వచనం పలికారు. కాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గడ్డంతో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్‌లో కనపడ్డాడు. తన కుమారుడు, కూతురుని ఎత్తుకుని తిరుమల వద్ద కనపడ్డ ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.        
Allu Arjun
Trivikram Srinivas
Ala Vaikunthapuramulo
TTD

More Telugu News