TTD: ఆన్ లైన్ డిప్ విధానంలో 11,498 టికెట్లు విడుదల చేసిన టీటీడీ!

  • మే నెల సేవా టికెట్లు విడుదల
  • 14,725 కల్యాణోత్సవం టికెట్లు అందుబాటులోకి
  • లక్కీ డిప్ లేకుండానే పలు సేవా టికెట్ల బుకింగ్ సదుపాయం
మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆన్ లైన్ లక్కీడిప్ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు విడుదల చేసింది. మొత్తం 11,498 టికెట్లను భక్తులకు అందించనున్నట్టు పేర్కొంది. సుప్రభాతానికి సంబంధించిన 8,143 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. 120 చొప్పున తోమాల, అర్చన సేవా టికెట్లను, 240 అష్టదళ పాదపద్మారాధన టికెట్లను, 2,875 నిజపాద దర్శనం టికెట్లను లక్కీ డిప్ లో అందిస్తామని పేర్కొంది. వీటితో పాటు 2000 విశేష పూజ, 14,725 కల్యాణోత్సవం, 15,400 ఆర్జిత బ్రహ్మోత్సవం, 16,800 సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను భక్తులు ఆన్ లైన్లో లక్కీ డిప్ లేకుండానే బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
TTD
Online
Lucky Dip
Tirumala

More Telugu News