ap7am logo

జగన్... పొరపాటున నువ్వు ప్రధాని అయ్యుంటే...: కేశినేని నాని

Fri, Feb 07, 2020, 08:54 AM
  • నీకున్న తెలివి మోదీకి లేదు
  • నువ్వు పీఎం అయితే, 36 రాజధానులు వచ్చేవి
  • ట్విట్టర్ లో కేశినేని నాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే పరిపాలన సజావుగా సాగుతుందని కేంద్రం చెబుతున్న వేళ, మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు.

" నీకున్న తెలివితేటలు మోదీగారికి లేవు జగన్. ఢిల్లీలో వున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేరు వేరు చోట్ల వుండటం వల్ల సమర్థవంతంగా పని జరగటం లేదని ఒకే చోటుకు తీసుకువస్తున్నారు. పొరపాటున నువ్వు ప్రధానమంత్రి అయి ఉంటే 28 రాష్ట్రాలలో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 36 రాజధానులు పెట్టేవాడివి" అని ఎద్దేవా చేశారు.
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad