sajjala Rama Krishna Reddy: జ్యడీషియల్ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తే.. రాయలసీమ అభివృద్ధి చెందుతుంది: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ప్రజల తీర్పుతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు
  • చట్ట సభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తాం  
  • ఐదేళ్లవరకు తాము అధికారంలో ఉంటాం

జ్యుడీషియల్ క్యాపిటల్ ను కర్నూలులో ఏర్పాటు చేయటం వల్ల రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వైసీపీ నేత, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. సజ్జల ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. చట్ట సభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని చెప్పారు. రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం హక్కా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేకపోతే.. చంద్రబాబు రాజధానిని ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు.

అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరగడానికి చంద్రబాబు కారణమన్నారు. బినామీల భూముల ధరలు పెంచేందుకు ప్రయత్నించారని సజ్జల ఆరోపించారు. అక్కడ పేదలకు, దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. అమరావతి ప్రాంతంలోకి అధికారులు ఇంకా షిఫ్ట్ కాలేదెందుకని ప్రశ్నించారు. ఇప్పటికీ అధికారులు హైదరాబాద్ నుంచి అమరావతికి తిరుగుతున్నారని చెప్పారు.

అమరావతిపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు అంటున్నారని.. ఎనిమిది నెలలకిందే ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఐదేళ్లవరకు తాము అధికారంలో ఉంటామన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేస్తామన్నారు. ప్రజలిచ్చిన తీర్పుతో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. అమరావతి ప్రజలు ఓపికపడితే.. నిజమైన అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు.

More Telugu News