Nara Lokesh: వైసీపీ ఇదే గూండాయిజంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించొచ్చుగా?: నారా లోకేశ్

  • వైసీపీ నాయకులకు చట్ట సభలు అంటే గౌరవం లేదు
  • వైసీపీ ఎక్కడైనా రౌడీయిజమే 
  • ఆఖరికి పార్లమెంట్ ను కూడా వదలలేదు
వైసీపీ నాయకులపై టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ లోక్ సభలో తమ సభ్యుడు రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యుడు గోరంట్ల మాధవ్ అడ్డుతగలడంపై లోకేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సంబంధిత వీడియోను లోకేశ్ పోస్ట్ చేశారు.

వైసీపీ నాయకులకు చట్ట సభలు అంటే గౌరవం లేదని, వైసీపీ సభ్యులు అసెంబ్లీలో రౌడీల్లా ప్రవర్తించారని, శాసనమండలి పరువు మంట గలిపారని, ఆఖరికి పార్లమెంట్ ని కూడా వీళ్లు వదల్లేదంటూ ధ్వజమెత్తారు. వైసీపీ ఎక్కడైనా రౌడీయిజమే చేస్తుందని, సాటి సభ్యుడిపై దాడికి యత్నించారంటే వారి ఉన్మాద స్థాయి అర్థమవుతుందని విమర్శించారు. ఇదే గూండాయిజంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించ వచ్చు కదా? అని వైసీపీ నాయకులను లోకేశ్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
Nara Lokesh
Telugudesam
YSRCP
Parliament

More Telugu News