Amaravati: రాజధాని గ్రామాల్లో సీఎం జగన్‌ పర్యటించాలి: రైతుల డిమాండ్‌

  • మా అభిప్రాయాలు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి
  • 51వ రోజు జల దీక్ష చేపట్టిన ఆందోళనకారులు
  • సేవ్‌ అమరావతి, సేవ్‌ ఏపీ అంటూ నినాదాలు
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలను వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. సేవ్‌ అమరావతి పేరుతో దీక్ష చేపట్టిన రైతులు 51వ రోజు జల దీక్ష చేపట్టారు. తాళ్లాయిపాలెం వద్ద కృష్ణా నదిలో నడుం లోతు నీటిలో మందడం రైతులు నిలబడి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ సీఎం అన్ని గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడాలని, రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సేవ్‌ అమరావతి, సేవ్‌ ఏపీ అంటూ నినాదాలు చేశారు.
Amaravati
farmers
jala deeksha

More Telugu News