హాట్ టాపిక్ గా మారిన వెంకటేశ్ పారితోషికం

06-02-2020 Thu 12:15
  • భారీ విజయాన్ని సాధించిన 'ఎఫ్ 2'
  • సీక్వెల్ కి జరుగుతున్న సన్నాహాలు 
  • ఆలోచనలో పడిన 'దిల్' రాజు   

సీనియర్ హీరోల్లో వెంకటేశ్ ఒక ప్రత్యేకమైన మార్గంలో తన కెరియర్ ను ముందుకు తీసుకెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ, మల్టీ స్టారర్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన పాత్రకి అధిక ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ, సక్సెస్ లో ఎక్కువ భాగం తన ఖాతాలో జమ చేసుకుంటున్నాడు.

ఈ తరహాలో ఆయన చేసిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సాధించింది. వసూళ్లపరంగా కూడా కొత్త రికార్డులను సృష్టించింది. దాంతో దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 3'కి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వెంకటేశ్ కి గతంలో కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలా? లేక లాభాల్లో వాటా ఇవ్వాలా? అనే విషయంలో 'దిల్' రాజు తన నిర్ణయాన్ని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిందట. దాంతో ఆయన ఆలోచనలో పడినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఎలా చేసినా వెంకటేశ్ కి భారీ మొత్తమే ముట్టనుందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ విషయం ఒక కొలొక్కి వస్తే ప్రాజెక్టు పట్టాలెక్కేస్తుందని అంటున్నారు.