చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి: విజయసాయిరెడ్డి

06-02-2020 Thu 10:31
  • రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది
  • కేంద్ర ప్రభుత్వంపైనా రుసురుసలాడుతున్నాడు
  • రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట.. మార్చే అధికారం లేదంట 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల అంశంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

'రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వంపైనా రుసరుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ' అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా అన్నారు.