IYR Krishna Rao: రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదన్న జీవీఎల్ వ్యాఖ్యలపై ఐవైఆర్ స్పందన

  • రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పిన జీవీఎల్
  • కొత్త ప్రభుత్వం మరో జీవో ఇస్తే కేంద్రం గుర్తిస్తుందని వ్యాఖ్య
  • గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం మోయాల్సిన అవసరం లేదని జీవీఎల్ చెప్పారన్న ఐవైఆర్
రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని... ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజధానిని మార్చలేరంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. రాజధానికి సంబంధించి కొత్త ప్రభుత్వం మరో జీవో ఇస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అసమంజస నిర్ణయాలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నెత్తిన వేసుకొని మోయాల్సిన అవసరం లేదని జీవీఎల్ స్పష్టంగా చెప్పారని ఐవైఆర్ అన్నారు. ముఖ్యంగా కేంద్రానికి రాజ్యాంగపరంగా అలాంటి అధికారం లేనప్పుడు... ప్రజాభిప్రాయం విశాఖ రాజధానికి అనుకూలంగా ఉన్నప్పుడు... రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని తెలిపారు.
IYR Krishna Rao
Amaravati
Vizag
GVL Narasimha Rao
BJP

More Telugu News