Radharavi: చిన్మయి నామినేషన్ తిరస్కరణ.. డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా రాధారవి ఏకగ్రీవం!

  • గతంలో చిన్మయి, రాధారవి మధ్య వివాదం
  • కోర్టుకెళ్లి సంఘంలో సభ్యత్వం తెచ్చుకున్న చిన్మయి 
  • ఇప్పుడు మళ్లీ కోర్టుకి వెళతానన్న గాయని

గతంలో ‘మీటూ’ అరోపణలు ఎదుర్కొన్న సీనియర్ నటుడు రాధారవి డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పోటీగా దాఖలు చేసిన డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాధారవి ఎన్నిక ఏకగ్రీవమైంది. తన నామినేషన్ తిరస్కరణపై చిన్మయి కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నెల 15న సంఘం ఎన్నికలు జరగనున్నాయి.

గతంలో ‘మీటూ’ వ్యవహారంలో రాధారవి, చిన్మయి మధ్య వివాదం తలెత్తింది. రాధారవిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో చిన్మయిని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. అయితే, ఆమె కోర్టును ఆశ్రయించి సంఘంలో మళ్లీ చోటు సంపాదించింది. సంఘం ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాధారవి మళ్లీ నామినేషన్ వేయగా, ఆయనకు పోటీగా చిన్మయి, కార్యదర్శి పదవికి మురళీకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, సంఘం నిబంధనల ప్రకారం చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.

More Telugu News